పోలవరం ప్రాజెక్టు విషయంలో సీఎం నారా చంద్రబాబునాయుడు రాష్ట్ర ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు.
చంద్రబాబు తప్పుదారి పట్టిస్తున్నారు:రామకృష్ణ
Mar 16 2017 12:21 PM | Updated on Aug 10 2018 8:23 PM
అనంతపురం: పోలవరం ప్రాజెక్టు విషయంలో సీఎం నారా చంద్రబాబునాయుడు రాష్ట్ర ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. జిల్లాలో నిర్వహించిన పార్టీ కార్యక్రమంలో పాల్గొనిన ఆయన పోలవరం ప్రాజెక్టుపై విభజన చట్టంలో స్పష్టంగా ఉందన్నారు.
గతంలోనే పోలవరం ప్రాజెక్టును కేంద్రం జాతీయ ప్రాజెక్ట్‌గా గుర్తించిందన్నారు. బాబు ఇప్పుడేదో సాధించినట్టు గొప్పలు చెప్పుకుంటున్నారు. రాష్ట్ర బడ్జెట్ కేవలం అంకెల గారడీ మాత్రమేనని రామకృష్ణ ప్రభుత్వాని ఎద్దేవా చేశారు.
Advertisement
Advertisement