'పట్టిసీమ ఓ పిచ్చి ప్రాజెక్ట్' | N.Jayaprakash narayan takes on chandrababu | Sakshi
Sakshi News home page

'పట్టిసీమ ఓ పిచ్చి ప్రాజెక్ట్'

Mar 25 2015 5:28 PM | Updated on Mar 9 2019 4:13 PM

'పట్టిసీమ ఓ పిచ్చి ప్రాజెక్ట్' - Sakshi

'పట్టిసీమ ఓ పిచ్చి ప్రాజెక్ట్'

రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం చేపట్టనున్న పట్టిసీమ ఓ పిచ్చి ప్రాజెక్ట్ అని లోక్సత్తా అధ్యక్షుడు ఎన్.జయప్రకాశ్ నారాయణ ఎద్దేవా చేశారు.

విశాఖపట్నం: రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం చేపట్టనున్న పట్టిసీమ ఓ పిచ్చి ప్రాజెక్ట్ అని లోక్సత్తా అధ్యక్షుడు ఎన్.జయప్రకాశ్ నారాయణ ఎద్దేవా చేశారు. బుధవారం ఓ ప్రవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు విశాఖపట్నం నగరానికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ... పట్టిసీమ ప్రాజెక్ట్ రాజకీయపరంగా కాంట్రాక్టర్లకు లబ్ది చేకూర్చే విధంగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

టీడీపీ అధికారంలోకి వచ్చి 9 నెలలైనా పోలవరం ప్రాజెక్టు కోసం కనీసం రూ.1 అయినా ఖర్చు చేశారా ? అని జయప్రకాశ్ నారాయణ... చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. విభజన తర్వాత పరిశ్రమలకు పన్ను రాయితీ ఇచ్చినప్పుడే అభివృద్ధి సాధ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు వికృత క్రీడల్లా కనిపిస్తున్నాయని జయప్రకాశ్ నారాయణ అభిప్రాయపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement