లారీ ఢీకొని తల్లీకూతుళ్లు మృతి | Mother and daughter died in road accident | Sakshi
Sakshi News home page

లారీ ఢీకొని తల్లీకూతుళ్లు మృతి

Jun 18 2016 4:16 PM | Updated on Apr 3 2019 7:53 PM

తూర్పుగోదావరి జిల్లా రాయవరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లి, కూతురు మృత్యువాతపడ్డారు. స్థానికంగా నివాసం ఉండే లంక రత్నం.. తన కుమార్తె హనీ(9 నెలలు) అనారోగ్యానికి గురి కావటంతో సోదరునితో కలసి బైక్‌పై ఆస్పత్రికి బయలుదేరింది.

రాయవరం (తూర్పు గోదావరి) : తూర్పుగోదావరి జిల్లా రాయవరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లి, కూతురు మృత్యువాతపడ్డారు. స్థానికంగా నివాసం ఉండే లంక రత్నం.. తన కుమార్తె హనీ(9 నెలలు) అనారోగ్యానికి గురి కావటంతో సోదరునితో కలసి బైక్‌పై ఆస్పత్రికి బయలుదేరింది. వారి బైక్‌ను వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొనటంతో రత్నం అక్కడికక్కడే చనిపోగా హనీకి తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కాసేపటికి పాప కూడా  కన్నుమూసింది. రత్నం సోదరుడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement