కలెక్టరుపై లోకాయుక్తలో ఫిర్యాదు | mlas complaints on collector | Sakshi
Sakshi News home page

కలెక్టరుపై లోకాయుక్తలో ఫిర్యాదు

Jul 6 2015 5:01 PM | Updated on May 29 2018 2:55 PM

వైఎస్సార్ జిల్లా కలెక్టరుపై జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు.

వైఎస్ఆర్ జిల్లా: వైఎస్సార్ జిల్లా కలెక్టరుపై జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన వారిలో వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్ రెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి ఉన్నారు. కలెక్టరు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని వారు పేర్కొన్నారు. కలెక్టర్ అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నారని విమర్శించారు. అదే విధంగా అధికారుల పట్ల ప్రొటోకాల్ పాటించడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు.

సీఎం జిల్లాకు వస్తున్నపుడు కనీసం సమాచారం కూడా అందిచడం లేదని వాపోయారు. కలెక్టరుకు ప్రజా ప్రతినిధులంటే గౌరవం లేదన్నారు. ప్రతి పనికీ కమిషన్లు అడుగుతున్నారని ఆరోపించారు. బ్రిటీష్ హయాంలో కూడా ఇలాంటి కలెక్టరు లేరని.. ఆయనపై వెంటనే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కలెక్టర్ అవినీతికి పాల్పడ్డారని సస్పెండ్ చేసిన చంద్రబాబు ఏ విధంగా వైఎస్ఆర్ జిల్లాకు నియమించారని ప్రశ్నించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement