తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
సాక్షి ప్రతినిధి, ఏలూరు : తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. బుధవారం హైదరాబాద్‌లో పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో ఆయన పార్టీ తీర్థం స్వీకరించారు. రాష్ట్ర విభజన నిర్ణయం తర్వాత కారుమూరి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం విదితమే. 2006లో జెడ్పీ చైర్మన్‌గా కారుమూరి ఎన్నికయ్యారు. 2009 ఎన్నికల్లో బీసీలకు ప్రాధాన్యత కల్పిం చాలన్న లక్ష్యంతో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి తణుకు సీటును కారుమూరికి కట్టబెట్టారు.
సుదీర్ఘకాలంగా ముళ్లపూడి కుటుంబీకుల చేతిలో ఉన్న తణుకులో ఎమ్మెల్యేగా గెలుపొందడం ద్వారా కారుమూరి రాష్ట్ర రాజకీయూల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. ఇదిలావుండగా, ఎమ్మెల్యే కారుమూరిని వైఎస్సార్ సీపీ దెందులూరు నియో జకవర్గ అదనపు సమన్వయకర్తగా నియమిస్తూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం రాత్రి ఉత్తర్వులు ఇచ్చారని పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.