మున్సిపల్ మినిస్టీరియల్ ఎంప్లాయీస్ నూతన కార్యవర్గం | Ministerial Municipal Employees Vizianagaram | Sakshi
Sakshi News home page

మున్సిపల్ మినిస్టీరియల్ ఎంప్లాయీస్ నూతన కార్యవర్గం

Feb 26 2016 12:31 AM | Updated on Sep 3 2017 6:25 PM

ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ మినిస్టీరియల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర సభ్యుల ఎంపిక గురువారం జరిగింది.

విజయవాడ (భవానీపురం) : ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ మినిస్టీరియల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర సభ్యుల ఎంపిక గురువారం జరిగింది. విజయవాడ గాంధీనగర్‌లోని శ్రీరామ్ ఫంక్షన్ హాలులో నిర్వహించిన అసోసియేషన్ సర్వసభ్య సమావేశంలో ఈ ఎంపిక చేపట్టారు. ఈ సమావేశంలో అసోసియేషన్ కార్యాచరణ, ఉద్యోగుల సంక్షేమం కోసం చేపట్టాల్సిన ప్రణాళిక తదితర అంశాలపై చర్చించారు. అనంతరం అసోసియేషన్ రాష్ట్ర సభ్యుల ఎన్నిక కార్యక్రమం ఏకగ్రీవంగా జరిగింది. కార్యక్రమంలో ఏపీ ఎన్‌జీవో నేత ఎ.విద్యాసాగర్ పాల్గొన్నారు.
 
 అసోసియేషన్ నూతన రాష్ట్ర కార్యవర్గం
 అధ్యక్షులుగా ఎన్.కష్ణమోహన్‌రావు (నరసాపురం), ప్రధాన కార్యదర్శిగా డి.ఈశ్వర్ (విజయవాడ కార్పొరేషన్), మహిళా ఉపాధ్యక్షురాలుగా జి.పావని (సీనియర్ అసిస్టెంట్, గుడివాడ), కోశాధికారిగా ఎస్.వెంకటేష్ (సీనియర్ అసిస్టెంట్, మచిలీపట్నం), ఉపాధ్యక్షులుగా ఎన్.నరసింహులు (హిందూపురం), కె.శివాజీ (పిఠాపురం), ఎం మురళి (ఆర్‌ఓ, తాడేపల్లి), కార్యదర్శులుగా ఈఎస్ ఎర్ర స్వామి (తాడిపర్తి), కేపీ శేఖర్ ఆదిత్య (తణుకు), ఎంవీఎస్‌ఎస్‌కేవీ ప్రసాద్ (విశాఖపట్నం), జాయింట్ సెక్రటరీలుగా ఎస్.అప్పయ్య (విజయనగరం), టి.నాగేశ్వరరావు (విజయవాడ), వి.నాగేశ్వరరావు (నూజివీడు), ఎం.మాల్యాద్రి (చీరాల)లతో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన మరో ఏడుగురిని ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా ఎన్నుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement