త్వరలో డయాలసిస్ కేంద్రాల ఏర్పాటు: ఆళ్ల నాని

సాక్షి, అమరావతి : రాష్ట్ర వ్యాప్తంగా కిడ్నీ వ్యాధిగ్రస్తుల సంఖ్య దాదాపు 8 శాతం ఉంటే కేవలం శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 15 నుంచి 18 శాతంగా ఉందని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని పేర్కొన్నారు. అసెంబ్లీలో మంగళవారం కిడ్నీ వ్యాధిగ్రస్తుల కోసం డయాలసిస్ సెంటర్ల ఏర్పాటుపై మంత్రి సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలోని వివిధ డయాలసిస్ కేంద్రాల్లో సుమారు పదివేల మంది రోగులు డయాలసిస్ చేయించుకున్నారని తెలిపారు. మైలవరంతో సహా రాష్ట్రంలో సుమారు పది డయాలసిస్ కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయన్నారు. ఈ కొత్తగా ప్రతిపాదించిన డయాలసిస్ సెంటర్లు మూడు నెలల్లో ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి