బీచ్‌కు వెళ్లిన మెడికోలు మృతి | MediCo's death on the beach | Sakshi
Sakshi News home page

బీచ్‌కు వెళ్లిన మెడికోలు మృతి

Dec 16 2015 8:03 PM | Updated on Sep 2 2018 4:48 PM

స్నేహితులతో కలిసి సరదాగ బీచ్‌కు వెళ్లిన ఇద్దరు మెడికోలు నీటి మునిగి మృతిచెందారు.

స్నేహితులతో కలిసి సరదాగ బీచ్‌కు వెళ్లిన ఇద్దరు మెడికోలు నీటి మునిగి మృతిచెందారు. ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం సమీపంలోని మత్స్యలేసం వద్ద బుధవారం చోటుచేసుకుంది. రిమ్స్‌లో చదువుతున్న పది మంది మెడికోలు ఈ రోజు బీచ్‌లో సరదాగ గడుపుతున్న సమయంలో ప్రమాదవశాత్తు ఇద్దరు నీట మునిగి మృతిచెందగా మరో యువకుడి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు విశాఖపట్నానికి చెందిన అనిల్‌చంద్ర(21), సందీప్(21)లుగా గుర్తించారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.


 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement