వరకట్న వేధింపులు తట్టుకోలేక గుంటూరులో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది.
వరకట్న వేధింపులు తట్టుకోలేక గుంటూరులో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఈఘటన గుంటూరు జిల్లా కొల్లూరులో వివాహిత భవాని ఉరేసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను కాపాడి ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె గురువారం మృతి చెందింది. కాగా.. అదనపు కట్నం కోసం అత్త, మామలు వేధించడం వల్లే భవాని ఆత్మహత్యకు పాల్పడిందని బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించి మరింత అందాల్సి ఉంది.