చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి మండలం గోపిదిన్నె గ్రామంలో అతిసారతో పి.వెంకటేశ్(34) అనే వ్యక్తి మృతిచెందాడు.
తంబళ్లపల్లి (చిత్తూరు) : చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి మండలం గోపిదిన్నె గ్రామంలో అతిసారతో పి.వెంకటేశ్(34) అనే వ్యక్తి మృతిచెందాడు. వారం రోజులుగా అతిసారతో బాధపడుతుండగా స్థానిక ఆసుపత్రిలో చికిత్స చేయించారు.
అయితే పరిస్థితి విషమించడంతో స్థానిక వైద్యుల సూచన మేరకు అతన్ని తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. కాగా అక్కడ చికిత్స పొందుతూ వెంకటేశ్ సోమవారం మృతి చెందాడు.