మద్దెలచెరువు సూరి హత్య కేసు దర్యాప్తు పూర్తి | Maddelacheruvu Suri Murder case investigation completed | Sakshi
Sakshi News home page

మద్దెలచెరువు సూరి హత్య కేసు దర్యాప్తు పూర్తి

Jan 31 2014 6:19 PM | Updated on Sep 2 2017 3:13 AM

మద్దెలచెరువు సూరి హత్య కేసు దర్యాప్తు పూర్తి

మద్దెలచెరువు సూరి హత్య కేసు దర్యాప్తు పూర్తి

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మద్దెలచెరువు సూర్యనారాయణ రెడ్డి (సూరి) హత్య కేసులో దర్యాప్తు పూర్తి చేసినట్టు సీఐడీ చీఫ్ కృష్ణప్రసాద్ చెప్పారు.

హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మద్దెలచెరువు సూర్యనారాయణ రెడ్డి (సూరి) హత్య  కేసులో దర్యాప్తు పూర్తి చేసినట్టు సీఐడీ చీఫ్ కృష్ణప్రసాద్ చెప్పారు. నాంపల్లి కోర్టులో విచారణ కొనసాగుతోందని తెలిపారు.

రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నడిబొడ్డున యూసుఫ్ గూడ ప్రాంతంలో కారులో వెళ్తున్న సూరిని కాల్చిచంపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో అనంతపురం జిల్లాకు చెందిన భానుకిరణ్ నిందితుడిగా ఉన్నాడు. ఆర్థిక లావాదేవీలే హత్యకు కారణమని అప్పట్లో వార్తలు వచ్చాయి. అనంతపురం జిల్లాను ఒకప్పుడు కుదిపేసిన ఫ్యాక్షన్ రాజకీయాల్లో సూరి కుటుంబ సభ్యులతో పాటు చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. పరిటాల రవి, సూరి కుటుంబాల మధ్య ఫ్యాక్షన్ నేపథ్యంగా సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ రెండు చిత్రాలు తీశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement