అరేబియా సముద్రంలో అల్పపీడనం | low pressure in arabian ocean | Sakshi
Sakshi News home page

అరేబియా సముద్రంలో అల్పపీడనం

Dec 15 2013 12:51 AM | Updated on Sep 2 2017 1:36 AM

అరేబియా సముద్రంలో అల్పపీడనం కొనసాగుతోంది. ఇటీవల పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో పెను తుపానుగా ఏర్పడి క్రమంగా బలహీనపడిన ‘మాదీ’ ప్రభావమే ఇది.

సాక్షి, విశాఖపట్నం:  అరేబియా సముద్రంలో అల్పపీడనం కొనసాగుతోంది. ఇటీవల పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో పెను తుపానుగా ఏర్పడి క్రమంగా బలహీనపడిన ‘మాదీ’ ప్రభావమే ఇది. శుక్రవారం నాటికి వాయుగుండంగా ఉన్న ఆ వాతావరణం శనివారం ఉదయానికి అల్పపీడనంగా మారింది. ఇది మరింత బలపడి తూర్పు దిశగా వెళ్లిపోతుంది. దీని ప్రభావం కారణంగా ప్రస్తుతం మన రాష్ట్రంపై ఎలాంటి ప్రభావం ఉండబోదని.. కేరళలో వర్షాలు పడే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. మరో 24 గంటల్లో ఇది బలహీనపడిపోయే అవకాశం ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement