నష్టం @ రూ. 551 కోట్లు | Loss @ Rs. 551 crore | Sakshi
Sakshi News home page

నష్టం @ రూ. 551 కోట్లు

Oct 27 2013 3:53 AM | Updated on Sep 2 2017 12:00 AM

గత నాలుగు రోజులుగా కురిసిన వర్షం జిల్లా రైతాంగాన్ని కోలుకోలేని విధంగా దెబ్బతీసింది. ఇళ్లు కూలిపోయి ఎందరో నిరాశ్రయులయ్యారు.

పాలమూరు, న్యూస్‌లైన్: గత నాలుగు రోజులుగా కురిసిన వర్షం జిల్లా రైతాంగాన్ని కోలుకోలేని విధంగా దెబ్బతీసింది. ఇళ్లు కూలిపోయి ఎందరో నిరాశ్రయులయ్యారు. వాగులు, వంకలు పారి మరెన్నో మారుమూల గ్రామాలు, తండాలకు రవాణా సౌకర్యం స్తంభించిపోయింది. పశువులు, కోళ్లు పిట్టల్లారాలాయి.
 
 జిల్లాలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో వాగులో ఇద్దరు గల్లంతయ్యాయి. జిల్లాలో వర్షం తాకిడికి రూ.551కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు జిల్లా అధికారయంత్రాంగం శనివారం అంచనావేసింది. కాగా, ఇళ్లు కూలి పోవడం, రోడ్లు దెబ్బతినడం, చెరువులు కుంటలు తెగిపోవడం, పశువులు చనిపోవడం తదితర వాటితో జిల్లాలో రూ.800 కోట్ల నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. జిల్లాలోని 54 మండలాల పరిధిలో దాదాపు 853 గ్రామాలకు చెందిన 15లక్షల మంది ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, నారాయణపేట, వనపర్తి డివిజన్ల పరిధిలో సుమారు 2.80 లక్షల ఎకరాల్లో పంట నీటమునిగి నష్టంవాటిల్లింది.
 
 పత్తి, మొక్కజొ న్న, మిర్చి, వరి, జొన్న, ఆముద, ఇతర పం టలు నీటమునిగాయి. శనివారం నాగర్‌కర్నూల్‌లో బల్మూరు మండలం పోశెట్టిపల్లికి చెందిన పార్వతమ్మ తెలకపల్లి మండలం లింగాల వెళ్లేదారిలోని గౌరెడ్డిపల్లి వాగులో నీటిలో కొట్టుకుపోయి గల్లంతైంది. జిల్లా కేంద్రానికి సమీపంలో ని గాండ్లోనికుంట తెగిపోవడంతో మహబూబ్‌నగర్ పట్టణంలోని బాయమ్మతోట, న్యూటౌన్, ప్రేమ్‌నగర్ తదితర ప్రాంతాల్లో వరదనీరు ఇళ్లలోకి చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. న్యూటౌన్ ప్రాంతంలోని హరహర ఫంక్షన్‌హాల్ సమీపంలో ప్రధాన రోడ్డుపై కుంటనీరు వరద లా పారింది. నాలుగు గంటల పాటు వాహనా ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
 
 ఎంత కష్టం..ఎంత కష్టం
 జిల్లావ్యాప్తంగా గడచిన నాలుగురోజుల్లో కురిసిన భారీవర్షాల కారణంగా మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, నారాయణపేట, వన పర్తి, గద్వాల డివిజన్ల పరిధిలో కలిగిన పంటనష్టం, దెబ్బతిన్న ఇళ్లు, ఇతర సంఘటనల కారణంగా జిల్లావ్యాప్తంగా రూ.551.13 కోట్లు నష్టం వాటిల్లినట్లు ప్రభుత్వ అధికారులు అంచనావేశారు. శనివారం నాటికి వివిధ రకాల పంటలు 35వేల ఎకరాల్లో దెబ్బతినగా రూ.58.70 కోట్లు నష్టం కలిగినట్లు తెలుస్తోంది. 3054 ఇళ్లు దెబ్బతినగా అందులో 248 ఇళ్లు నేలమట్టమైనట్లు అధికారులు ప్రకటించారు. ఈ మేరకు రూ.8.54 కోట్ల నష్టం వాటిల్లింది. పశువులు, జీవాలు 118, కోళ్లఫారాల్లో 50వేల కోళ్లు మృతి చెందినట్లు సమాచారం. 398 చెరువు కట్టలు తెగిపోయి 22.21కోట్ల నష్టం కలుగగా, ఆర్‌అండ్‌బీ బ్రిడ్జిలు 21, 50 కి.మీ రోడ్డు దెబ్బతినడంతో రూ.51.62 కోట్ల నష్టం జరిగింది. పంచాయతీ రోడ్లు 75 కిమీ పాడై రూ.31 లక్షలు నష్టంవాటిల్లినట్లు అంచనా. జిల్లాలో 21 గ్రామీణ నీటి సరఫరా పథకాలు దెబ్బతిని రూ.33 ల క్షల నష్టం కలిగినట్లు అధికారులు అంచనావేశారు.
 
 జిల్లా వ్యాప్తంగా 12.4 మి.మీ వర్షం
 శనివారం జిల్లా వ్యాప్తంగా 12.4 మి.మీ వర్షం పాతం నమోదైందని వాతావరణ విభాగం అధికారులు తెలిపారు. 48.2 మిల్లీ మీటర్లతో కొత్తూరు మండలంలో అత్యధిక వర్షపాతం నమోదు కాగా.. కేశంపేట 46.2 మి.మీ, మాడ్గులలో 43.0, ఆమనగల్లు 38.6, హన్వాడ 38.0, షాద్‌నగర్, వెల్దండ 32.6, బాలానగర్ 30.2, బల్మూరు 28.6, తలకొండపల్లి 28.0, పెద్దకొత్తపల్లి 24.0, మహబూబ్‌నగర్ 21.2, ఉప్పునుంతల 20.0 మి.మీటర్ల మేర వర్షపాతం నమోదైంది. దౌల్తాబాద్, దామరగిద్ద, కోడేరు, వడ్డేపల్లి, అలంపూరు, మానవపాడు, ఇటిక్యాల మండలాల్లో ఏమాత్రం వర్షం పడలేదు. మిగిలిన 44 మండలాల్లో 20 మి.మీ లోపు వర్షపాతం నమోదైంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement