ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ | Larry RTC bus collision | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ

Jan 22 2016 12:16 AM | Updated on Sep 3 2017 4:03 PM

నల్లజర్ల మండలం అనంతపల్లి శివారు సంజీవపురం పెట్రోలు బంక్ వద్ద గురువారం ఉదయం ఆర్‌టీసీ బస్సును లారీ ఢీకొంది.


 అనంతపల్లి (నల్లజర్ల రూరల్) : నల్లజర్ల మండలం అనంతపల్లి శివారు సంజీవపురం పెట్రోలు బంక్ వద్ద గురువారం ఉదయం ఆర్‌టీసీ బస్సును లారీ ఢీకొంది. బస్సు కుడి భాగం స్వల్పంగా దెబ్బతింది. ఈ ఘటనలో భీమడోలుకు చెందిన  యర్రంశెట్టి వెంకట గౌరీకుమారికి గాయాలయ్యాయి. ఆమెను రాజమండ్రి ఆసుపత్రికి తరలించారు.  కృష్ణాజిల్లా హనుమాన్ జంక్షన్ నుంచి కోళ్లపెంటను యర్నగూడెం తీసుకువచ్చిన లారీ తిరుగు ప్రయాణంలో అనంతపల్లి పెట్రోల్ బంక్ వద్ద ఏలూరు వెళుతున్న ఆర్‌టీసీ బస్సును ఓవర్ టేక్ చేసి అదుపు తప్పి కుడివైపు దూసుకు పోయింది.

లారీ బస్సును ఎడమవైపునకు ఈడ్చుకుపోయి చెట్టును ఢీకొని ఆగిపోయింది. బస్సులో 35 మంది ఉన్నారు. వారు పోలీసులు పోలీసులకు సమాచారం అందించారు. లారీ ఆయిల్ ట్యాంక్ పగిలిపోయి ఆయిల్ బయటకు వచ్చేసింది. అంటుకుంటే మంటలు చెలరేగి బంక్‌తో సహా తగలిబడి అతి పెద్ద ప్రమాదం జరిగేది. లారీ డ్రైవరు గవిర్ని సతీష్‌కు స్వల్ప గాయాలయ్యాయి. కొవ్వూరు డీఎస్సీ వెంకటేశ్వరరావుప్రమాద వివరాలను బస్సు డ్రైవర్ సింగిరెడ్డి చంద్రశేఖర్ నుంచి అడిగి తెలుసుకున్నారు. ఎస్సై నాయక్ కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement