భూమి రిజిస్ట్రేషన్లు మూడు రోజులు బంద్ ! | land Registrations for three days Bandh | Sakshi
Sakshi News home page

భూమి రిజిస్ట్రేషన్లు మూడు రోజులు బంద్ !

May 28 2014 1:18 AM | Updated on Sep 2 2018 4:48 PM

రాష్ట్ర విభజన పుణ్యమాని జిల్లాలో మూడు రోజుల పాటు భూమి రిజిస్ట్రేషన్లు నిలిచిపోనున్నాయి. విభజన నేపథ్యంలో ఉమ్మడి ఖాతా ను ఈ నెల 30వ తేదీతో ముగిస్తున్నారు.

 శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజన పుణ్యమాని జిల్లాలో మూడు రోజుల పాటు భూమి రిజిస్ట్రేషన్లు నిలిచిపోనున్నాయి. విభజన నేపథ్యంలో ఉమ్మడి ఖాతా ను ఈ నెల 30వ తేదీతో ముగిస్తున్నారు. దీంతో కొత్తగా ఏర్పాటు కానున్న సీమాం ధ్రా (ఆంధ్రప్రదేశ్) రాష్ట్రానికి కొత్త ఖాతాను రాష్ట్ర స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ప్రారంభించనుంది. ఈ పరిస్థితుల్లో ఈ నెల 31 నుంచి జూన్ రెండో తేదీ వరకు రిజిస్ట్రేషన్లకి సంబంధించిన అన్ని రకాల లావాదేవీలు స్తంభించిపోనున్నాయి. ఈ మేరకు ఉమ్మడి రాష్ట్రం స్టాంపులు, రిజిస్ట్రేషన్లశాఖ ఆధికారు లు జిల్లాలకు, సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు ఉత్తర్వులు జారీ చేశారు. దీని కారణంగా జిల్లాలో సుమారు రెండు కోట్ల రూపాయలు విలువలు చేసే లావాదేవీలు నిలిచిపోయే అవకాశం ఉంది. వేసని సీజన్ లో అధికంగా భూముల అమ్మకాలు, కొనుగోలు జరుగుతాయి.
 
 అయితే ఈ మూడో రోజుల పాటు వీటి రిజిస్ట్రేషన్లు నిలిచిపోతున్నాయి. అలాగే రైతుల వ్యయవసాయ భూములతో పాటుగా, ఇళ్ల స్థలాలు, ఇతర భూములు, రిజిస్ట్రేషన్లు, అందుకు సంబంధించిన సర్టిఫికెట్ ఆఫ్ కాపీస్ (సీసీలు), అన్ క్రాంబిరేషన్ ధ్రువపత్రాలు (ఈసీలు) రిజిస్ట్రార్ వివాహాలు, కొత్త సంస్థల ఏర్పాటుకి సంబంధించిన రిజిస్ట్రేషన్లు, గతంతో రిజిస్ట్రేషన్ పొందిన నకల్లు తదితర వ్యవహారాలు ఆగిపోతాయి.  మీ-సేవా కేంద్రాల ద్వారా అందజేసే ధ్రువపత్రాలు కూడా ఆ మూడు రోజుల పాటు అందుబాటులో ఉం డవు. కొత్త ఖాతా వచ్చిన తరువాత మాత్ర మే ఈ వ్యవహారాలన్ని నడుస్తాయి. జిల్లాలో జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో పాటు 15 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలున్నా యి. వీటిలో రోజుకి సుమారుగా రూ. 70 లక్షలు మేర ఆర్థిక లావాదేవీలు జరగుతాయి. రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించిన ఖాతాను ఈనెల 30 సాయంత్రం ఆరు గంటలతో మూసివేయనున్నారు. తిరిగి జూన్ రెండో తేదీన కొత్త ఖాతాతో కార్యాలయాలు పని చేస్తాయని సంబంధిత అధికారులు చెబుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement