ప్రాణం తీసిన 'ల్యాండ్ పూలింగ్' | land pooling claims woman life in Amaravathi | Sakshi
Sakshi News home page

ప్రాణం తీసిన 'ల్యాండ్ పూలింగ్'

May 8 2015 3:53 PM | Updated on May 25 2018 7:04 PM

ఏపీ రాజధాని ల్యాండ్ పూలింగ్ వ్యవహారం ఓ మహిళ చావుకు కారణమైంది.

గుంటూరు: ఏపీ రాజధాని ల్యాండ్ పూలింగ్ పచ్చని గ్రామాల్లోనే కాదు, పచ్చని సంసారాల్లోనూ చిచ్చు పెడుతోంది. ల్యాండ్ పూలింగ్ వ్యవహారం ఓ మహిళ చావుకు కారణమైంది. గుంటూరు జిల్లా అమరావతిలో సామ్రాజ్యం అనే వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ుదయం తన ఇంటి సమీపంలోని బావిలోకి దూకి ఆమె ప్రాణాలు తీసుకుంది.

తనకు కట్నం ఇచ్చిన 25 సెంట్ల భూమి అమ్మాలని సామ్రాజ్యం భర్త నిత్యం వేధించాడు. అయితే ఆమె కుటుంబ సభ్యులు ఈ భూమిని ల్యాండ్ పూలింగ్ కింద ప్రభుత్వానికి ఇచ్చేశారు. తన భూమి  ఇక తిరిగిరాదని తెలుసుకున్న ఆమె మనస్థాపంతో బలవన్మరణానికి పాల్పడింది. సామ్రాజ్యం భర్త వాసు, అత్తమామలు పరారీలో ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement