
పోలీసుల తీరు మహిళా లోకానికే అవమానం..
వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే రోజా పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు మహిళా లోకానికే అవమానమని ఎమ్మెల్యే కొడాలి నాని పేర్కొన్నారు.
కృష్ణా :
వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే రోజా పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు మహిళా లోకానికే అవమానమని ఎమ్మెల్యే కొడాలి నాని పేర్కొన్నారు. రోజాపై దాడి యావత్ మహిళలపై దాడిగా భావించాలన్నారు. సాక్షాత్తు ఎమ్మెల్యేల హక్కులనే కాలరాస్తు సదస్సులు నిర్వహించే హక్కు ప్రభుత్వానికి లేదని కొడాలి నాని మండిపడ్డారు.