కిరణ్, బాబు సమైక్య ద్రోహులు | kiran kumar reddy and chandra babu are scoundrels | Sakshi
Sakshi News home page

కిరణ్, బాబు సమైక్య ద్రోహులు

Published Tue, Dec 17 2013 4:21 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM

రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రధాన ప్రతిపక్ష నేత నారాచంద్రబాబు నాయుడు సమైక్య ద్రోహులని వైఎస్సార్సీపీ కర్నూలు నియోజకవర్గం సమన్వయకర్త ఎస్వీ మోహన్‌రెడ్డి విమర్శించారు.

 కర్నూలు, న్యూస్‌లైన్:
 రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రధాన ప్రతిపక్ష నేత నారాచంద్రబాబు నాయుడు సమైక్య ద్రోహులని వైఎస్సార్సీపీ కర్నూలు నియోజకవర్గం సమన్వయకర్త ఎస్వీ మోహన్‌రెడ్డి విమర్శించారు. వారిని రాళ్లతో కొట్టి తరిమే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని హెచ్చరించారు. సభ అనుమతి లేకుండానే టీ-బిల్లు చర్చకు అనుమతించడంపై నిరసిస్తూ సోమవారం రాత్రి శ్రీకృష్ణదేవరాయల సర్కిల్‌లో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, స్పీకర్ నాదెండ్ల మనోహర్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. అనంతరం ఎస్వీ మాట్లాడుతూ అసెంబ్లీకి బిల్లు వస్తే దాని సంగతి తేలుస్తామని బీరాలు పలికిన సీఎం, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఇప్పుడు మోహం చాటేశారని విమర్శించారు.
 
   కిరణ్‌కుమార్ రెడ్డి అధిష్టానం చెప్పినట్లుగా నాటకం ఆడుతున్నారని ఆరోపించారు. సమైక్య తీర్మానానికి వైఎస్సార్సీపీ నాలుగు నెలలుగా పట్టుబడుతున్నా పట్టించుకోలేదని విమర్శించారు. పార్లమెంటుకు వెళ్లకుండా బిల్లును అడ్డుకుంటానని చెప్పి ఇప్పుడు మొహం చాటేయడం సిగ్గు చేటని విమర్శించారు. టేబుల్ ఐటమ్‌గా సభ దృష్టికి తీసుకొచ్చి టీ-బిల్లును ఆమోదించేందుకు కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు కుట్ర పన్నుతున్నారని విమర్శించారు. సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు జిల్లా పర్యటనలకు వస్తే ఎక్కడి వారిని అక్కడే అడ్డుకుని చీపుర్లతో తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. రాష్ర్టం సమైక్యంగా ఉండేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందన్నారు. ఇందుకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జాతీయ స్థాయిలో నాయకుల మద్దతు కూడగడుతున్నారని తెలిపారు.
 
  వైఎస్సార్సీపీ మైనార్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మునీర్ అహ్మద్, నగర కన్వీనర్ షరీఫ్, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు తెర్నేకల్ సురేందర్‌రెడ్డి, మాజీ కార్పొరేటర్ తోటా వెంకటక్రిష్ణారెడ్డి, పులి జాకోబ్, ఎస్సీ సెల్ జిల్లా కన్వీనర్ కిషన్, కోడుమూరు నియోజకవర్గ సమన్వయకర్త మణిగాంధీ, యువజన విభాగం నగర కన్వీనర్ రాజా విష్ణువర్ధన్‌రెడ్డి, వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ సిటీ కన్వీనర్ రాఘవేంద్ర నాయుడు, మహేష్ గౌడ్, సహదేవుడు, వైఎస్సార్సీపీ మహిళా విభాగం నాయకురాలు బీజాన్‌బీ, మద్దమ్మ, శాంతమ్మ, కాంతమ్మ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement