‘ప్రాణహాని ఉంది..రక్షణ కల్పించండి’

Kakinada Former MP Warns To Protection Of Dalit Right President - Sakshi

సాక్షి, కాకినాడ సిటీ: సార్వత్రిక ఎన్నికల్లో మాజీ ఎంపీ హర్షకుమార్‌ చెప్పిన పార్టీకి సపోర్టు చేయకుండా తాము వైఎస్సార్‌ సీపీకి పని చేయడంతో తమను చంపేస్తామని బెదిరిస్తున్నారని మహాసేన దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు రాజేష్‌ సరిపెల్ల వివరించారు. శుక్రవారం కాకినాడ ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. హర్షకుమార్‌ అనుచరులు తమను రకరకాలుగా బెదిరింపులకు దిగుతున్నారని, హర్షకుమార్‌ వల్ల తమకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని కోరారు. ఈ విషయమై జిల్లా ఎస్పీ అద్నాన్‌ నయిం అస్మీని కలసి వివరించినట్టు తెలిపారు.  హర్షకుమార్‌పై చట్టపరమైన చర్యలు తీసుకొని, తమకు, మహాసేన సభ్యులకు రక్షణ కల్పించాలని కోరారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Taboola - Feed

Back to Top