108 సేవల్లో జాప్యం జరిగితే చర్యలు తప్పవు

Jawahar Reddy Holds Review Meeting On 108 Services - Sakshi

సాక్షి, అమరావతి : 108 సేవల విషయంలో జాప్యం జరిగితే చర్యలు తప్పవని వైదార్యోగ్య శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జవహర్‌రెడ్డి హెచ్చరించారు. 108 సేవలపై సమీక్షలో భాగంగా మంగళవారం వీవీజీ సంస్థ ప్రతినిధులతో జవహర్‌రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా 108 కాల్‌ సెంటర్‌ను ఆయన పరిశీలించారు.108 వాహనాల్లో ప్రాథమిక చికిత్సకు కావాల్సిన పరికరాలను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు.

108 వాహనాల నిర్వహణకు కనీసం మూడు నెలల పాటు కావాల్సిన నిధులను సిద్ధంగా ఉంచుకోవాలని జవహర్‌రెడ్డి ఆదేశించారు. ప్రభుత్వం వైపు నుంచి నిధుల జాప్యాన్ని నివారిస్తామని తెలిపారు.108 సేవలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న నిధుల విడుదలపై నివేదికను సిద్దం చేయాలన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top