వైఎస్సార్‌ జిల్లాలో దారుణం | Inhuman incident in YSR District | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ జిల్లాలో దారుణం

Sep 28 2017 10:46 AM | Updated on Sep 28 2017 12:21 PM

Kadapa

ఎర్రగుంట్ల: వైఎస్సార్‌ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. స్వైన్‌ఫ్లూతో ఓ వ్యక్తి మృతి చెందగా అతని మృతదేహాన్ని గ్రామంలోకి తీసుకురావొద్దంటూ వైద్య సిబ్బంది, అధికారులు అడ్డుపడ్డారు. ఎర్రగుంట్ల మండలపరిధిలోని చిలంకూర్‌కు చెందిన ప్రతాప్‌ (45) వారం రోజులుగా స్వైన్‌ఫ్లూతో బాధపడుతున్నాడు. దీంతో బుధవారం ప్రొద్దుటూరులోని జిల్లా ఆస్పత్రికి తరలించారు. అయితే వైద్యులు స్వైన్‌ఫ్లూగా నిర్ధారించి బాధితుడిని ఇంటికి తీసుకెళ్లాలని సూచించారు.

కొద్ది సేపటికి ప్రతాప్‌ ఆస్పత్రిలోనే మృతిచెందాడు. అనంతరం మృతదేహాన్ని గ్రామంలోకి తీసుకురానివ్వకుండా వైద్య సిబ్బంది, చిలంకూర్‌ గ్రామ పంచాయతీ అధికారులు అడ్డుకున్నారు. దీంతో ప్రతాప్‌ కుటుంబ సభ్యులు చేసేదేమీలేక మృతదేహానికి గ్రామం వెలుపలే దహన సంస్కారాలు నిర్వహించారు.   

Advertisement
 
Advertisement
Advertisement