తుని ఘటనతో కాపులంటే అరాచకశక్తులుగా ముద్రపడిం దని రాష్ట్ర మంత్రి పి.నారాయణ అన్నారు.
ఈ నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగానే ప్రభుత్వం అప్రమత్తమైందని, పోలీసులు కూడా విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. కాపులను బీసీల్లో చేర్చడానికి ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసిందని, మూడు లేదా ఆరు నెలల్లో నివేదిక అందుతుందని చెప్పారు. కాపు రిజర్వేషన్ల కోసం 35 ఏళ్లు ఆగినవాళ్లు కొద్ది నెలలు ఆగలేరా? అని ప్రశ్నించారు.