నేను రాజీనామా చేస్తా: టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే

I Will Resign For MLA Post Said By Jagityal MLA  Sanjay Kumar - Sakshi

జగిత్యాల జిల్లా: జగిత్యాల నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ కుమార్తె కల్వకుంట్ల కవిత కోసం తాను పదవీ త్యాగం చేస్తానని చెప్పారు. జగిత్యాల నుంచి పోటీ చేయాలని కవితను కోరుతానని తెలిపారు. టీపీసీసీ ప్రెసిడెంట్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి నల్గొండ నుంచి ఎంపీగా ఎన్నిక కావడంతో ఖాళీ అయిన హుజూర్‌ నగర్‌ స్థానం నుంచి కవిత పోటీ చేయబోరని వ్యాఖ్యానించారు.

ఏది ఏమైనా టీఆర్‌ఎస్‌లో అదిష్టాన నిర్ణయమే ఫైనల్‌ అవుతుందని చెప్పారు. ఇటీవల జరిగిన ఎంపీ ఎన్నికల్లో నిజామాబాద్‌ నుంచి పోటీ చేసిన కేసీఆర్‌ కుమార్తె కవిత ఘోరంగా ఓడిపోయిన సంగతి తెల్సిందే. బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్‌ చేతిలో 70 వేల 875 ఓట్ల తేడాతో కవిత ఓటమి చవిచూశారు. అయితే రాష్ట్రంలో జరిగే ఉప ఎన్నికల్లో కవిత నిలబెడతారా లేదా అనేది చర్చనీయాంశమైంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top