భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త | Husband kills Wife | Sakshi
Sakshi News home page

భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త

Jul 18 2015 3:28 PM | Updated on Jul 30 2018 8:29 PM

కుటుంబ కలహాలతో భార్యను కత్తితో పొడిచి హతమార్చాడు ఓ కసాయి భర్త. ఈ సంఘటన చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో శనివారం ఉదయం చోటుచేసుకుంది.

చిత్తూరు (శ్రీకాళహస్తి) : కుటుంబ కలహాలతో భార్యను కత్తితో పొడిచి హతమార్చాడు ఓ కసాయి భర్త. ఈ సంఘటన చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో శనివారం ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. శ్రీకాళహస్తిలోని తుఫాన్ సెంటర్‌కు చెందిన అల్లూరుమ్మ(28)కు అదే ప్రాంతానికి చెందిన అంకయ్యకు రెండేళ్ల కిందట వివాహమైంది.

అయితే వీరు తరుచూగా గొడవ పడుతూ ఉంటూరు. ఈ క్రమంలో శనివారం భార్యతో వాగ్వివాదానికి దిగిన అంకయ్య ఆమెను కత్తితో పొడిచాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement
 
Advertisement
Advertisement