కాకినాడలో గురువారం దారుణమైన ఘటన చోటు చేసుకుంది.
తూ.గో:కాకినాడలో గురువారం దారుణమైన ఘటన చోటు చేసుకుంది. భార్యతో జీవితాంతం కలిసి బ్రతకాల్సిన భర్త.. కత్తితో నరికి చంపడంతో వెంకటేశ్వరకాలనీలో కలకలం సృష్టించింది. మరియమ్మ అనే మహిళను భర్త రామకృష్ణ కత్తితో అతి దారుణంగా నరికి హత్య చేయడమే కాకుండా..శరీర భాగాలను రోడ్డుపై పడేసి భయాందోళనలు రేకిత్తించాడు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. గత కొన్ని రోజులుగా కుటుంబంలో చోటుచేసుకున్న విభేదాలే ఈ హత్యకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.