శ్రీశైలం ప్రాజెక్టుకి భారీ వరద | Sakshi
Sakshi News home page

శ్రీశైలం ప్రాజెక్టుకి భారీ వరద

Published Fri, Aug 17 2018 6:19 PM

Heavy Floods To Srisailam Project - Sakshi

సాక్షి, కర్నూలు : శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు చేరుతోంది. ఎగువన కురుస్తోన్న భారీ వర్షాలకు 3,36,503 క్యూసెక్కుల నీరు జలాశయంలోకి ఇన్‌ఫ్లోగా వస్తుండగా, 1,03,792 క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుత నీటి మట్టం 874 అడుగులకు చేరింది. జలాశయం సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా, ప్రస్తుత నిల్వ 180.28 టీఎంసీలకు చేరింది. మరికొన్ని గంటల పాటు ఇదే వరద కొనసాగితే ప్రాజెక్టు నీటి మట్టం పూర్తి స్థాయికి చేరే అవకాశం ఉందని అధికారుల తెలిపారు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement