శుభం గ్రాండ్‌లో హీరో నిఖిల్ | Grand Costume Store openings Hero Nikhil | Sakshi
Sakshi News home page

శుభం గ్రాండ్‌లో హీరో నిఖిల్

Dec 19 2014 1:39 AM | Updated on Sep 2 2017 6:23 PM

శుభం గ్రాండ్‌లో హీరో నిఖిల్

శుభం గ్రాండ్‌లో హీరో నిఖిల్

నగరంలో గత ఫిబ్రవరిలో ప్రారంభమైన శుభం గ్రాండ్ వస్త్ర దుకాణంలో పురుషుల విభాగాన్ని గురువారం ప్రారంభించారు.

ఏలూరు(ఆర్‌ఆర్‌పేట) : నగరంలో గత ఫిబ్రవరిలో ప్రారంభమైన శుభం గ్రాండ్ వస్త్ర దుకాణంలో పురుషుల విభాగాన్ని గురువారం ప్రారంభించారు. సినీ హీరో నిఖిల్ జ్యోతి వెలిగించి ఈ విభాగాన్ని ప్రారంభించారు. నగరానికి చెందిన పారిశ్రామికవేత్త మడుపల్లి మోహనగుప్తా, మల్లీశ్వరి దంపతులు ప్రథమ కొనుగోలు చేశారు. కార్యక్రమంలో ఎంపీ మాగంటిబాబు, ఎమ్మెల్యే బడేటి బుజ్జి, నగర మేయర్ షేక్ నూర్జహాన్, ఎస్‌ఎంఆర్ పెదబాబు పాల్గొన్నారు. సంస్థ అధినేత మాజేటి సురేష్ మాట్లాడుతూ నాణ్యమైన వస్త్రాలు అందించాలనే ఉద్దేశంతో తమ తండ్రి మాజేటి శేషగిరిరావు 1993వ సంవత్సరంలో వాసవి శిల్క్స్ షోరూంను ప్రారంభించారని నగర ప్రజల ఆదరాభిమానాలతో గత ఫిబ్రవరిలో ప్రత్యేకించి మహిళల కోసం శుభం గ్రాండ్ షోరూంను ప్రారంభించామన్నారు.
 
 కుటుంబమంతటికీ కావలసిన వస్త్రాలను ఇక్కడే అందించాలనే ఉద్దేశంతో పురుషుల విభాగాన్ని గురువారం ప్రారంభించామన్నారు. తక్కువ ధరలకే బ్రాండెడ్ వస్త్రాలు అందిస్తామన్నారు. తమ సంస్థ 11 రాష్ట్రాల్లోని ప్రముఖ మిల్లుల నుంచి వస్త్రాలను కొనుగోలు చేస్తోందన్నారు. సొంత డిజైన్లతో ఆర్డర్లిచ్చి వస్త్రాలను రూపొందిస్తున్నామన్నారు. క్రిస్మస్, సంక్రాంతి, పెళ్లిళ్ల సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని తమ షోరూంలో రూ.2500 వస్త్రాలు కొనుగోలు చేసినవారికి రూ.500 విలువైన కూపన్లు అందిస్తున్నామన్నారు. ఈ కూపన్లతో ఆరు నెలలలోపు తిరిగి ఈ షోరూంలో రూ. 2500 విలువైన వస్త్రాలు కొనుగోలు చేసి రూ.500 మినహాయింపు పొందవచ్చన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement