‘జీపీఎస్‌’ కీళ్ల మార్పిడి చికిత్స అద్భుతం | GPS Joint replacement therapy is miracle | Sakshi
Sakshi News home page

‘జీపీఎస్‌’ కీళ్ల మార్పిడి చికిత్స అద్భుతం

May 21 2017 3:31 AM | Updated on Aug 18 2018 3:49 PM

‘జీపీఎస్‌’ కీళ్ల మార్పిడి చికిత్స అద్భుతం - Sakshi

‘జీపీఎస్‌’ కీళ్ల మార్పిడి చికిత్స అద్భుతం

గైడెడ్‌ పర్సనలైజ్డ్‌ సర్జరీ(జీపీఎస్‌) విధానంలో కీళ్ల మార్పిడి శస్త్రచికిత్సలను వంద శాతం విజయవంతంగా

‘అమరావతి ఆర్థోప్లాస్టీ’ సదస్సులో డాక్టర్‌ నికోలస్‌ జేఏ తుల్ప్‌

లబ్బీపేట (విజయవాడ తూర్పు): గైడెడ్‌ పర్సనలైజ్డ్‌ సర్జరీ(జీపీఎస్‌) విధానంలో కీళ్ల మార్పిడి శస్త్రచికిత్సలను వంద శాతం విజయవంతంగా నిర్వహించవచ్చని ప్రముఖ కీళ్ల మార్పిడి శస్త్ర చికిత్స నిపుణుడు డాక్టర్‌ నికోలస్‌ జేఏ తుల్ప్‌(నెదర్లాండ్‌) అన్నారు. విజయవాడ ఆర్థోపెడిక్‌ సొసైటీ, సన్‌రైజ్‌ హాస్పిటల్స్‌ సంయుక్త ఆధ్వర్యంలో ‘అమరావతి ఆర్థోప్లాస్టీ’ పేరుతో శనివారం విజయవాడలో జరిగిన రాష్ట్రస్థాయి  సదస్సు ను డాక్టర్‌ నికోలస్‌  ప్రారంభించి  మాట్లాడారు.

జీపీఎస్‌ విధానం ద్వారా చేస్తున్న కీళ్ల మార్పిడి శస్త్ర చికిత్సలు కచ్చి తత్వం, ఎక్కువ మన్నికతో అద్భుత ఫలితాలిస్తున్నా యని చెప్పారు. సదస్సు ఆర్గనైజింగ్‌ సెక్రటరీ డాక్టర్‌ ఎం.నరేంద్రకుమార్‌ మాట్లాడుతూ జీపీఎస్‌ టెక్నాలజీని రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దే శంతో సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం  నికోలస్‌ నేతృత్వంలో జీపీఎస్‌ విధానంలో రివిజన్‌నీ, ప్రైమరీనీ ఆపరేషన్లు నిర్వహించి, లైవ్‌ టెలి కాస్ట్‌ ద్వారా సదస్సులో పాల్గొన్న వైద్యులకు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement