చిక్కోల్లో ‘గీతాంజలి’ సందడి | GITANJALI MOVIE TEAM VISIT SRIKAKULAM | Sakshi
Sakshi News home page

చిక్కోల్లో ‘గీతాంజలి’ సందడి

Aug 19 2014 2:36 AM | Updated on Oct 2 2018 3:16 PM

చిక్కోల్లో ‘గీతాంజలి’ సందడి - Sakshi

చిక్కోల్లో ‘గీతాంజలి’ సందడి

పట్టణంలోని సూర్యామహల్‌లో ‘గీతాంజలి’ సినిమా యూనిట్ సోమవారం సందడి చేసింది. కోనవెంకట్ సమర్పణలో, ఎంవీవీ పతాకంపై ఎం.వి.వి.సత్యనారాయణ

 శ్రీకాకుళం కల్చరల్: పట్టణంలోని సూర్యామహల్‌లో ‘గీతాంజలి’ సినిమా యూనిట్ సోమవారం సందడి చేసింది. కోనవెంకట్ సమర్పణలో, ఎంవీవీ పతాకంపై ఎం.వి.వి.సత్యనారాయణ నిర్మించిన సినిమా ఈ నెల 9న విడుదలైంది. ఈ సందర్భంగా వచ్చిన యూనిట్ సభ్యులకు పూల బొకేలు, బాణ సంచాతో థియేటర్ యజమానులు స్వాగతం పలికారు. అనంతరం సినిమా మధ్యలో యూనిట్ సభ్యులు ప్రేక్షకుల స్పందన అడిగి తెలుసుకున్నారు.
 
 సినీనటుడు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ సినిమాను ఇంతగా ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. హరర్‌లో కామెడీని కలిపి అందించిన దర్శకుడికి ధన్యవాదాలు తెలిపారు. డైలాగ్ రైటర్, స్క్రీన్‌ప్లే, డైలాగ్ రైటర్ కోన వెంకట్ మాట్లాడుతూ మీ చిక్కోలు చిన్నోడు షకలక శంకర్‌ను ఆదరించినందుకు ఆనందంగా ఉందన్నారు. షకలక శంకర్ మాట్లాడుతూ మన శ్రీకాకుళంలో నేను నటించిన సినిమాను ఇంతగా ఆదరించడం సంతోషదాయకమన్నారు. వీరితో పాటుగా దర్శకుడు రాజ్‌కిరణ్, సంగీత దర్శకుడు ప్రవీణ్ లక్కరాజులు ప్రేక్షక దేవుళ్లకు నమస్కారం చేశారు. కార్యక్రమంలో థియేటర్ యజమాని ధనంబాబు, మేనేజర్ రమేష్, నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement