అయ్యో! పాపం

Girl Child Throw in Handri Neeva Canal Chittoor - Sakshi

పురిటి బిడ్డను హంద్రీ–నీవా కాలువలో పడేసిన యువకులు

కాపాడిన మేకల కాపరి

ప్రభుత్వాస్పత్రిలో పసికందుకు చికిత్స

మదనపల్లె టౌన్‌: అప్పుడే పుట్టిన పసికందు. ఇంకా కళ్లు కూడా తెరవలేదు.    తల్లి పొత్తిళ్లలో నులి వెచ్చని స్పర్శను అనుభవిస్తూ ఉండాల్సిన ఆ పసికందు   ను కొందరు యువకులు హంద్రీ–నీవా కాలువ వద్ద పడేసిన సంఘటన గురువారం కురబలకోట మండలంలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధిం చి మదనపల్లె సీడీపీఓ లక్ష్మీదేవి కథనం..కురబలకోట మండలం పూసావారిపల్లెకు చెందిన సోమశేఖర్‌ మేకలు మేపుకుని జీవనం సాగిస్తున్నాడు. గురువారం మేకలు మేపడానికి అంగళ్లు సమీపంలోని మల్లయ్యకొండకు వెళ్లా డు. అక్కడి హంద్రీ–నీవా కాలువ వద్ద మేకలు మేపుతుండగా ఇద్దరు యువకులు ద్విచక్రవాహనంలో వచ్చి బొడ్డుకూడా ఊడని, అప్పుడే పుట్టిన ఓ పసికందును హంద్రీ–నీవా కాలువ వద్ద వదలి వెళ్లిపోయారు. ఆ పసికందు ఏడుపు విన్న మేకల కాపరి స్థానికుల సాయంతో ఆటోలో తీసుకొచ్చి మదనపల్లె జిల్లా ఆస్పత్రిలో చేర్పించాడు. డాక్టర్లు చికిత్స చేశారు. సమాచారం అందుకున్న సీడీపీఓ, ఆస్పత్రికి చేరుకున్నారు. పసికందును అంగన్‌వాడీ ఆయాల సంరక్షణలో ఉంచారు. పసికందుకు జన్మనిచ్చిన మహిళ ఎవరో తెలుసుకోవాలని కురబలకోట, అంగ ళ్లు సూపర్‌వైజర్లను ఆదేశించారు. జన్మనిచ్చిన తల్లికి ఏం సమస్య వచ్చిందోగానీ పసికందును హతమార్చడం ఇష్టం లేక వదలి వెళ్లిపోయారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top