చంద్రబాబుకు హర్హకుమార్ లేఖ | former Mp harsh kumar slams chandrababu | Sakshi
Sakshi News home page

చంద్రబాబుకు హర్హకుమార్ లేఖ

Apr 23 2016 1:41 PM | Updated on Oct 3 2018 7:42 PM

ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలో దళితులు వివక్షకు గురవుతున్నారని మాజీ ఎంపీ హర్షకుమార్ ధ్వజమెత్తారు.

కాకినాడ: ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలో దళితులు వివక్షకు గురవుతున్నారని మాజీ ఎంపీ హర్షకుమార్ ధ్వజమెత్తారు. ఈ మేరకు ఎంపీ హర్షకుమార్ ముఖ్యమంత్రికి ఓ లేఖ రాశారు. దాన్ని ఆయన శనివారం మీడియాకు విడుదల చేశారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు అన్ని విషయాల్లోనూ అన్యాయమే జరుగుతోందన్నారు. చంద్రబాబులా అబద్ధాలు ఆడే ముఖ్యమంత్రి మరొకరు ఉండరని దుయ్యబట్టారు. దళితులను పైకి తీసుకురావాలని నిజంగా ఉంటే ఎస్సీ, ఎసీ సబ్‌ప్లాన్ నిధులపై శ్వేత పత్రం విడుదల చేయాలని సీఎంను డిమాండ్ చేశారు. అలాగే, తెలంగాణ మాదిరిగా మార్కెటింగ్ చైర్మన్ పోస్టులలో రిజర్వేషన్ కల్పించాలని కోరారు. అమరావతిలో నిర్మించే అంబేద్కర్ భారీ విగ్రహాన్ని ప్రభుత్వ నిధులతోనే చేపట్టాలన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement