విజయవాడ నగరంలోని రహదారులకు మార్కింగ్ చేస్తున్న వాహనంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో వాహనం మొత్తం కాలిపోయింది.
విజయవాడ : విజయవాడ నగరంలోని రహదారులకు మార్కింగ్ చేస్తున్న వాహనంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో వాహనం మొత్తం కాలిపోయింది. మంగళవారం ఉదయం ఐదో నెంబర్ రహదారి సమీపంలోని రమేష్ ఆస్పత్రి వద్ద మంగళవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. రహదారిపై మార్కింగ్ చేస్తున్న వాహనంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.
వాహనంలో పెద్ద ఎత్తున పెయింట్స్ డబ్బాలు ఉండటంతో మంటలు వేగంగా వాహనాన్ని చుట్టుముట్టాయి. స్థానికులు వెంటనే స్పందించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైరింజన్లు ఘటన స్థలానికి చేరుకునే సరికే వాహనం కాలిపోయింది.