అర్చకులు, పాస్టర్లు, ఇమామ్‌లు, మౌజన్‌లకు రూ.5వేల ఆర్థిక సాయం

financial assistance of Rs 5000 to Priests and Pastors - Sakshi

అకౌంట్లలో నగదు జమచేసిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

ఆర్థిక ఇబ్బందుల నుంచి ఊరట కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం

మొత్తం 77,290 మందికి లబ్ధి

సీఎంను ఆశీర్వదిస్తూ ప్రార్థనలు

సాక్షి, అమరావతి/నెట్‌వర్క్‌: కోవిడ్‌ విపత్తు సమయంలో ఇబ్బందులు పడుతున్న అర్చకులు, పాస్టర్లు, ఇమామ్‌లు, మౌజన్‌లకు వన్‌టైమ్‌ ఆర్థిక సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందించింది. గుంటూరు జిల్లా తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయంలో మంగళవారం కంప్యూటర్‌ బటన్‌ నొక్కి నేరుగా వారివారి ఖాతాల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నగదు జమ చేశారు.
దీని ద్వారా 33,803 మంది అర్చకులు, 29,841 మంది పాస్టర్లు, 13,646 మంది ఇమామ్‌లు, మౌజన్‌లకు రూ.37.71 కోట్ల మేర లబ్ధి చేకూరింది. ఈ కార్యక్రమంలో దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, బ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, చీఫ్‌ సెక్రటరీ నీలం సాహ్ని, ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్చకులు, పాస్టర్లు, ఇమామ్‌లు ప్రత్యేక ప్రార్థనలు చేసి ముఖ్యమంత్రి
వైఎస్‌ జగన్‌ను ఆశీర్వదించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top