చిత్తూరు జిల్లా మదనపల్లి చంద్రయ్య కాలనీలో ఓ చేనేత కార్మికుడిపై అతని మామ, మరో ఇద్దరు సోమవారం సాయంత్రం వేటకొడవళ్లతో దాడి చేశారు.
మదనపల్లి రూరల్ : చిత్తూరు జిల్లా మదనపల్లి చంద్రయ్య కాలనీలో ఓ చేనేత కార్మికుడిపై అతని మామ, మరో ఇద్దరు సోమవారం సాయంత్రం వేటకొడవళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన అతడి పరిస్థితి విషమంగా ఉంది. ప్రాథమిక సమచారం మేరకు.. కురబల కోట మండలం బోయపల్లికి చెందిన అప్పులప్ప (35) మదనపల్లి చంద్రయ్య కాలనీలో నివసిస్తూ చేనేత కార్మికుడిగా జీవనం సాగిస్తున్నాడు.
ఇతడికి శ్యామల, విజయలక్ష్మి అనే ఇద్దరు భార్యలు, పిల్లలు ఉన్నారు. కాగా అప్పులప్పకు అతని రెండో భార్య విజయలక్ష్మి, తండ్రి లక్ష్మయ్యతో గొడవ జరిగింది. దీంతో లక్ష్మయ్య, గంగాధర్, వెంకటరమణ అనే ముగ్గురు అప్పులప్పపై వేటకొడవళ్లతో దాడి చేసి నరికారు. ఈ దాడిలో చేతులు తెగిపోగా, గొంతు భాగంలోనూ తీవ్ర గాయం అయింది. పరిస్థితి విషమంగా ఉండడంతో తిరుపతి రుయాకు తరలించారు.