రుణమాఫీ జాబితాలో రైతుల పేర్లు గల్లంతు: ఆందోళన | farmers protest at bank of india in kovvuru mandal for their name missing in loan waiver list | Sakshi
Sakshi News home page

రుణమాఫీ జాబితాలో రైతుల పేర్లు గల్లంతు: ఆందోళన

Dec 15 2014 11:21 AM | Updated on Oct 1 2018 2:00 PM

రుణమాఫీకి సంబంధించి విడుదల చేసిన రెండో జాబితాలో కొంతమంది రైతులు పేర్లు గల్లంతు కావడం కాస్తా ఆందోళనకు దారి తీసింది.

ప.గో: రుణమాఫీకి సంబంధించి విడుదల చేసిన రెండో జాబితాలో  రైతులు పేర్లు గల్లంతు కావడం కాస్తా ఆందోళనకు దారి తీసింది. దీనిలో భాగంగా సోమవారం కొవ్వూరు మండలంలో బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. తమ పంట రుణాలను వాణిజ్య రుణాలుగా బ్యాంకు సిబ్బంది మార్చడంతో రైతులు నిరసన కార్యక్రమం చేపట్టారు.

 

పసివేదల, వేమూలూరు, తోభూమి గ్రామాల నుంచి రైతులు బ్యాంక్ దగ్గరకు వచ్చి అధికారులు తీరుపై మండిపడుతున్నారు. అధిక సంఖ్యలో రైతుల పేర్లను తొలగించారని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతుల రుణమాఫీ కి సంబంధించిన ప్రభుత్వం విడుదల చేసి రెండవ జాబితాను ఆన్ లైన్ లో ఉంచిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement