అప్పుల బాధతో కౌలురైతు ఆత్మహత్య | farmer commits suicide in easdt godavari district | Sakshi
Sakshi News home page

అప్పుల బాధతో కౌలురైతు ఆత్మహత్య

Feb 20 2016 10:04 AM | Updated on Nov 6 2018 7:56 PM

తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం చిన్న నర్సింపేట గ్రామానికి చెందిన మొగిలి అప్పారావు(30) అనే కౌలు రైతు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు.

గొల్లప్రోలు : తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం చిన్న నర్సింపేట గ్రామానికి చెందిన మొగిలి అప్పారావు(30) అనే కౌలు రైతు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పారావు నాలుగెకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని పత్తి, వరి పంటలు వేశాడు. అయితే వర్షాభావంతో పంటలు చేతికి రాక అప్పులు పేరుకు పోవడంతో తీవ్ర మనస్థాపం చెందాడు. దీంతో శనివారం వేకువజామున ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement