ఫణిని ఎదుర్కొందాం

Fani Cyclone In West Godavari - Sakshi

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లాలో ‘ఫణి’ తుపాను ప్రభావంతో ఎదురయ్యే విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అన్నిశాఖలు  సమన్వయంతో సమాయత్తం కావాలని కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ ఆదేశిం చారు. కలెక్టరేట్‌లో శనివారం ఫణి తుపాను ముందస్తు జాగ్రత్తలపై సంబంధిత అధికా రులతో ఆయన సమీక్షించారు. జిల్లాలోని మొగల్తూరు, నరసాపురం, భీమవరం, కాళ్ల మండలాల్లోని 30 నివాసిత ప్రాం తాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. మచిలీపట్నానికి 1,460 కిలోమీ టర్ల తూర్పుదిశగా తుపాను కేంద్రీకృతమైనందున అధికారులంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. తుపాను గమనాన్ని రాష్ట్రంలో ఆర్‌టీజీఎస్, ఐఎండీ నిశితంగా గమనిస్తూ ఎప్పటికప్పుడూ ప్రత్యేక బులిటెన్‌లు విడుదల చేస్తాయని, వాటిని గమనిస్తూ అవసరమైన ముందస్తు చర్యలు అధికారులు చేపట్టాలన్నారు.

ఫణి తుపాను ప్రభావం గమనంపై సోమవారం నాటికి స్పష్టత వస్తుందని ఆరోజు క్షేత్రస్థాయి అధికారులతో వీడియో కాన్ఫెరెన్స్‌ నిర్వహించి అవసరమైన ఆదేశాలు ఇస్తామని చెప్పారు. రానున్న 48 గంటల్లో నిత్యావసర వస్తువులను ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ నుంచి చౌక ధర దుకాణాలకు తరలించాలని పౌరసరఫరాల అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. జిల్లాలోని 15 తుపాను రక్షణా కేంద్రాలను తనిఖీ చేసి ఏర్పాట్లను పరిశీలించాలన్నారు. ఈదురుగాలుల కా రణంగా విద్యుత్‌ అంతరాయం కలిగే సమయాలను మండలస్థాయిలో అధికారులకు సమాచారం అందించాలని, తాగునీటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలన్నారు. జలవనరుల శాఖ, ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్, మత్స్య, అగ్నిమాపక, పోలీస్, ఆర్‌టీసీ తదితర శాఖాధికారులు తుపాను హెచ్చరికలను ఎప్పటికప్పుడూ గమనిస్తూ అందుకు అవసరమైన ప్రత్యామ్నాయ రక్షణ తదితర చర్యలు చేపట్టాలన్నారు.
 
రైతులను అప్రమత్తం చేయండి
జిల్లాలో ధాన్యం సేకరణ జరుగుతున్న దృష్ట్యా రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అవసరమైన చర్యలు తీసుకో వడం ద్వారా వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపాలని వ్యవసాయాధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. తుపాను ప్రభావం మూలంగా రైతులు నష్టపోకుండా అవసరమైన ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలన్నారు. పశువులకు అవసరమైన ఎండిగడ్డి కొరత లేకుండా చూడటంతో పాటు వ్యాక్సిన్లు కూడా సిద్ధం చేయాలని పశుసంవర్థకశాఖ జేడీని కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ ఆదేశించారు.
 
ఈవీఎం గోడౌన్లకు రెయిన్‌ ప్రూఫ్‌ 

సాధారణ ఎన్నికల ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్‌ రూంల కిటికీలకు రేయిన్‌ ప్రూఫ్‌ ఏర్పాట్లు చేయాలని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. ఫణి తుపాను హెచ్చరికల దృష్ట్యా వర్షాలు కురిసే అవకాశం ఉన్నం దున ఈవీఎంలకు సమస్యలు లేకుండా జిల్లాలో మూడు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌ రూమ్‌లను రిటర్నింగ్‌ అధికారులు తనిఖీ చేసి అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఎం.వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ఫణి తుపాన్‌ హెచ్చరికలను దృష్టిలో ఉంచుకుని కమ్యూనికేషన్‌ సిస్టమ్‌కు ఎటువంటి అవాంతరాలు ఏర్పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో వివిధ సెల్‌ కంపెనీల టవర్స్‌ వద్ద ఉన్న జనరేటర్లు వినియోగంలో ఉండేలా చూడాలన్నారు. సముద్ర తీర మండలాల్లో రెండు నెలలకు సరిపడా నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉంచుతామన్నారు. ఫణి తుపాను మూ లంగా ప్రాణ, ఆస్తి నష్టాలను జరగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు.

ప్రత్యేకాధికారులు.. కంట్రోల్‌ రూమ్‌
తుపాను హెచ్చరికల దృష్ట్యా కలెక్టరేట్‌లో 1800– 233–1077 టోల్‌ ఫ్రీ నెంబర్‌తో కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేసినట్టు కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ చెప్పారు. అదేవిధంగా తీర ప్రాంతంలోని ఏడు మండలాలకు జిల్లాస్థాయి అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించామన్నారు. మొగల్తూరు మండలానికి జెడ్పీ సీఈఓ వి.నాగార్జునసాగర్‌ (94937 42399), నరసాపురం మండలానికి కేఆర్‌ పురం ట్రైబల్‌ వెల్ఫేర్‌ ఎస్‌డీసీ జి.దేవసహాయం (70932 65495), భీమవరం మండలానికి డ్వామా పీడీ సీహెచ్‌ మాలకొండయ్య (90001 20789), కాళ్ల మండలానికి ఇందిరా సాగర్‌ ప్రాజెక్టు ఆర్‌ఎంసీ కరుణకుమారి (70934 71333), పాలకొల్లు మండలానికి జిల్లా సహకార శాఖాధికారి భగవాన్‌ (91001 09176), యలమంచిలి మం డలానికి ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ రమేష్‌ (9849905963), పోడూరు మండలానికి ఆత్మాపీడీ హరి (88861 14334)ను నియమించామన్నారు.

డీఆర్‌ఓ ఎన్‌.సత్యనారాయణ, జెడ్పీ సీ ఈఓ వి.నాగార్జునసాగర్, నరసాపురం ఆర్డీఓ సలీమ్‌ఖాన్, డీఆర్‌డీఏ పీడీ గణేష్‌ కుమార్, డీఎంహెచ్‌ఓ బి.సుబ్రహ్మణ్యేశ్వరి, ఏపీఈపీడీసీఎల్‌ ఎస్‌ఈ సత్యనారాయణ, డీపీఓ ఆర్‌.విక్టర్, మత్స్య, వ్యవసా య, పశుసంవర్ధక శాఖ జేడీలు అం జలి, గౌసియా బేగం, శ్రీనివాస్, జలవనరుల శాఖ ఎస్‌ ఈ రఘునాథ్, కాలుష్య నియంత్రణ మండలి ఈఈ వెంకటేశ్వర్లు, డ్వామా పీడీ మాలకొండయ్య, డీఎస్‌ఓ మోహనబాబు, ఫైర్‌ ఆఫీసర్‌ శంకరరావు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top