
చంద్రబాబును కలిసిన ఈటల
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్ కలిశారు.
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్ కలిశారు. శుక్రవారం ఉదయం గన్నవరం విమానాశ్రయంలో చంద్రబాబును కలిసిన ఈటల... తన కుమారుడు నితిన్ వివాహానికి హాజరు కావాల్సిందిగా ఆహ్వానించారు. ఇప్పటికే ఆయన ... తన కొడుకు పెళ్లి పిలుపుల్లో బిజీగా ఉన్నారు. ఈటల కుమారుడి పెళ్లి జూన్ 18న హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో జరగనుంది.