థ్యాంక్స్‌ టు జగనన్న

Engineering Students Thank CM YS Jagan - Sakshi

కోరంగిలో ‘కైట్‌’ విద్యార్థినుల ర్యాలీ

సాక్షి, తాళ్లరేవు (ముమ్మిడివరం): పేద విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ధన్యవాదాలు తెలియజేస్తూ కైట్‌ గ్రూప్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ కళాశాలల విద్యార్థినులు శుక్రవారం అభినందన ర్యాలీ నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు మండలం కోరంగి గ్రామంలోగల కైట్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో విద్యనభ్యసిస్తున్న సుమారు 1,500 మందికిపైగా విద్యార్థినులు ‘థాంక్యూ సీఎం, థాంక్యూ జగన్‌’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా కళాశాల చైర్మన్‌ పోతుల వెంకట విశ్వం మాట్లాడుతూ గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని ప్రారంభించి నిరుపేద విద్యార్థులు ఉన్నత చదువులు చదివేందుకు అవకాశం కల్పించారన్నారు. ప్రస్తుతం ఆయన తనయుడు, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేద విద్యార్థుల చదువుకయ్యే ఖర్చును పూర్తిగా భరించడంతోపాటు వసతి, భోజనం కోసం అదనంగా ఇరవై వేలు ప్రకటించడం అభినందనీయమన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top