విద్యుద్ఘాతంతో ఏనుగు మృతి | elephant dies due to shortcircute | Sakshi
Sakshi News home page

విద్యుద్ఘాతంతో ఏనుగు మృతి

May 11 2015 9:21 PM | Updated on Sep 3 2017 1:51 AM

విద్యుద్ఘాతంతో ఓ ఏనుగు మృతి చెందింది.

విజయనగరం(సాలూరు): విద్యుద్ఘాతంతో ఓ ఏనుగు మృతి చెందింది. విజయనగరం జిల్లా సాలూరు మండలం గాదిపిల్లివలస గ్రామ సమీపంలో గంగులు అనే రైతుకు చెందిన అరటితోటలో ఈ ఘటన చోటుచేసుకుంది. పంటపొలాలకు విద్యుత్ సరఫరా చేసే ఎల్‌టీలైన్ వైర్లు దిగువగా ఉండటం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు భావిస్తున్నారు. అటవీ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టి, ఏనుగుకు పోస్టుమార్టం నిర్వహించారు. కాగా, దానితోపాటు ఉన్న చిన్న ఏనుగును వైల్డ్‌లైఫ్ ప్రొటక్షన్‌యాక్ట్ 1972 ప్రకారం తిరిగి వచ్చిన ప్రదేశానికి తరలించేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement