జంగారెడ్డిగూడెంలో జంట హత్యలు | double murders in jangareddy gudem | Sakshi
Sakshi News home page

జంగారెడ్డిగూడెంలో జంట హత్యలు

Nov 21 2014 9:55 AM | Updated on Sep 29 2018 4:52 PM

జంగారెడ్డిగూడెంలో జంట హత్యలు - Sakshi

జంగారెడ్డిగూడెంలో జంట హత్యలు

జంగారెడ్డిగూడెంలో ఫైనాన్షియర్ దంపతులను హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.

ప:గో: జిల్లాలో మరో దారుణం చోటు చేసుకుంది.  జంగారెడ్డిగూడెంలో ఫైనాన్షియర్ దంపతులను హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. విజయ పేరుతో ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్న లక్ష్మణరావును కొంతమంది దుండగులు పెట్రోల్ బంక్ సమీపంలో గొడ్డలితో నరికి హత్య చేశారు. లక్ష్మణరావుతో పాటు అడ్డువచ్చిన అతని భార్య తులసిని కూడా హత్య చేశారు.

 

ఈ ఘటనతో స్థానిక ప్రజలు భయాందోళనలు గురయ్యారు.  ఈ జంట హత్యలకు పాత కక్షలే ప్రధాన కారణం కావచ్చని అనుమానిస్తున్నారు. దీనిపై సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ దారుణం గురువారం అర్ధరాత్రి దాటాక జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement