
‘ఆల్‌ఫ్రీ’ బాబును నమ్మొద్దు
ఎలాగైనా అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో ఆల్‌ఫ్రీ అంటూ ప్రజలను మభ్యపెడుతున్న టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును నమ్మవద్దని వైఎస్సార్సీపీ మంత్రాలయం నియోజకవర్గ సమన్వయకర్త వై.బాలనాగిరెడ్డి తెలిపారు.
కోసిగి, న్యూస్‌లైన్: ఎలాగైనా అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో ఆల్‌ఫ్రీ అంటూ ప్రజలను మభ్యపెడుతున్న టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును నమ్మవద్దని వైఎస్సార్సీపీ మంత్రాలయం నియోజకవర్గ సమన్వయకర్త వై.బాలనాగిరెడ్డి తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ తరుఫున పోటీ చేస్తున్న అభ్యర్థుల కోసం సోమవారం కోసిగిలో ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
కోసిగిలోని రైల్వేస్టేషన్ రోడ్డు, సిద్దప్ప పాళెం తేరుబజార్, ఎన్‌టీఆర్ కాలనీ, గాంధీనగర్, నాడుగేని వీధి, చింతల గేని వీధి, కాశమ్మ గడ్డ వీధుల్లో పర్యటించి ఫ్యానుగుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని విమర్శించారు. ఒకప్పుడు రైతులకు ఉచిత కరెంట్ ఇస్తానని దివంగత నేత వైఎస్సార్ ప్రచారం చేస్తే.. ‘ ఆ తీగలపై బట్టలు ఆరేసుకోవాలి’ అంటూ చంద్రబాబు విమర్శించాడని అన్నారు.
అలాంటి బాబు ఇప్పుడు ఆయన పథకాలనే కాపీ కొట్టి అధికారంలోకి రావాలని కుట్రలు పన్నుతున్నాడని పేర్కొన్నారు. కాంగ్రెస్, టీడీపీ కారణంగానే రాష్ట్ర రెండు ముక్కలైందని విమర్శించారు. ఇప్పుడు కాంగ్రెస్‌లోని నాయకులను టీడీపీలో చేర్చుకుని అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నాడన్నారు. అయితే ప్రజలు టీడీపీని నమ్మే స్థితిలో లేరని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడం తథ్యమని పేర్కొన్నారు.
అలాగే స్థానిక ఎన్నికల్లోనూ వైఎస్సార్ పార్టీని ఆదరించి ఎంపీటీసీ అభ్యర్థులతో పాటు జెడ్పీటీసీ అభ్యర్థి దళవాయి మంగమ్మను గెలిపించాలని కోరారు. ప్రచారంలో ఆ పార్టీ మండల ఇన్ చార్జి మురళీరెడ్డి, కన్వీనర్ బెట్టనగౌడు, నాయకులు ఆదినారాయణ, చెన్నబసవ, ఇస్మాయిల్, సోఫి రజాక్, ఉమర్ సాహెబ్, శ్రీనివాసరెడ్డి, నాడుగేని నరసింహులు, జగదీష్ స్వామి, మంతేష్ స్వామి, ఈరన్న, సూరి, కోసిగయ్య, అయ్యప్ప, కోసిగి 1వ, 2వ 3వ,5వ, 6వ ఎంపీటీసీ అభ్యర్థులు తామయ్య, మంగమ్మ, నాగరత్నమ్మ, లక్ష్మి, గోవిందు పాల్గొన్నారు.