మంత్రి నారాయణకు వ్యతిరేకంగా ఆందోళన | dharna against minister narayana | Sakshi
Sakshi News home page

మంత్రి నారాయణకు వ్యతిరేకంగా ఆందోళన

Mar 15 2016 12:52 PM | Updated on Aug 21 2018 5:46 PM

ఓ కేసు పోలీసు అధికారులపై ఒత్తిడి తెస్తున్నారని మంత్రి నారాయణకు వ్యతిరేకంగా నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం డప్పేపాడు గ్రామస్తులు ధర్నా చేపట్టారు.

ఆత్మకూరు: నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం డప్పేపాడు రోడ్డులో సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో డప్పేపాడు గ్రామానికి చెందిన కట్టా శేఖర్(24) అనే యువకుడు మృతిచెందాడు. యువకుని మృతికి కారణమైన ట్రాక్టర్ డ్రైవర్, యజమానిపై పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసు నుంచి వారిని తప్పించడానికి మంత్రి నారాయణ పోలీసు అధికారులపై ఒత్తిడి తెస్తున్నారని ఆరోపిస్తూ మృతుని బంధువులతో పాటు డప్పేపాడు గ్రామస్తులు మంగళవారం ఉదయం పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు.

ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల తమ బిడ్డను కోల్పోయి తాము బాధపడుతుంటే నిందితులను కాపాడేందుకు సాక్షాత్తూ మంత్రి రంగంలోకి దిగడం దారుణమని వారు ఆరోపిస్తున్నారు. నిందితులపై చర్య తీసుకోకపోతే మంత్రికి వ్యతిరేకంగా ఆందోళనను ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement