రెడీమేడ్ గార్మెంట్స్‌పై ప్రభుత్వం విధించిన ఎక్సైజ్ డ్యూటీని రద్దు చేయాలంటూ వస్త్ర వ్యాపారులు ఆందోళనకు దిగారు.
విజయవాడ: రెడీమేడ్ గార్మెంట్స్‌పై ప్రభుత్వం విధించిన ఎక్సైజ్ డ్యూటీని రద్దు చేయాలంటూ వస్త్ర వ్యాపారులు ఆందోళనకు దిగారు. విజయవాడ రెడీమేడ్ మర్చంట్స్ వెల్‌ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నగరంలో ర్యాలీ చేశారు. రెడీమేడ్ రంగాన్ని రక్షించండి, రెడీమేడ్ దుస్తులపై ఎక్సైజ్ డ్యూటీ వద్దు అంటూ ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. ప్రభుత్వం ఈ విషయంపై త్వరగా నిర్ణయం తీసుకోకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని పలువురు వ్యాపారులు హెచ్చరించారు.