తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్యను మాజీ మంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు
శ్రీకాకుళం పాతబస్టాండ్: తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్యను మాజీ మంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు మంగళవారం ఆర్‌అండ్‌బీ వసతి గృహంలో గౌరవపూర్వకంగా కలిశారు. గవర్నర్ జిల్లాకు రావడంపై ధర్మాన సంతోషం వ్యక్తం చేశారు. రోశయ్య ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ధర్మాన ఆయన మం త్రి వర్గంలో పనిచేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఇద్దరూ క్షేమ సమాచారాలు తెలియజేసుకున్నారు.
అలాగే రోశయ్యను శ్రీకాకుళం పట్టణానికి చెందిన ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు గౌరవ పూ ర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు రోశయ్య ను దుశ్శాలువ, పుష్పగుచ్చాలతో సత్కరించారు. కార్యక్రమంలో వాసవీ చైర్మన్ మండవల్లి రవి, పేర్ల రాంబాబు, మకటపల్లి నానాజీ, పేర్ల నర్సింగరావు, పేర్ల సురేష్, పేర్ల సాంబమూర్తి, కృష్ణారావు, నరేష్, సంతోష్, రమేష్ తదితరులు ఉన్నారు.