కార్తీక పౌర్ణమి సందర్భంగా గురువారం శ్రీశైల పుణ్యక్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది. వేలాది భక్తులు పవిత్ర పాతాళగంగ....
శ్రీశైలం : కార్తీక పౌర్ణమి సందర్భంగా శైవ క్షేత్రాలు శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులతో శివాలయాలు కిటకిటలాడుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీశైల పుణ్యక్షేత్రానికి భక్తులు పోటెత్తారు. వేలాది భక్తులు పవిత్ర పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించారు. నదిలో కార్తీక దీపాలు వదిలి మొక్కులు చెల్లించుకున్నారు. మరోవైపు భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని స్వామివారి ఆర్జిత అభిషేకాలు, కుంకుమార్చన సేవలను పాలకమండలి రద్దు చేసింది.
కాగా ఈరోజు సాయంత్రం పాతాళగంగ స్నానఘట్టాల వద్ద హారతి కార్యక్రమం జరగనుంది. అదేవిధంగా ఆలయ ప్రాంగణం ముందున్న గంగాధర మండపం వద్ద జరగనున్న జ్వాలాతోరణ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.