'కేసీఆర్ సెక్షన్ 8 చెల్లదనడం సరికాదు' | Devineni uma takes on telangana cm kcr due to section 8 | Sakshi
Sakshi News home page

'కేసీఆర్ సెక్షన్ 8 చెల్లదనడం సరికాదు'

Jun 16 2015 11:39 AM | Updated on Mar 23 2019 8:59 PM

'కేసీఆర్ సెక్షన్ 8 చెల్లదనడం సరికాదు' - Sakshi

'కేసీఆర్ సెక్షన్ 8 చెల్లదనడం సరికాదు'

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై ఆంధ్రప్రదేశ్ భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా మంగళవారం విజయవాడలో మండిపడ్డారు.

విజయవాడ: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై ఆంధ్రప్రదేశ్ భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా మంగళవారం విజయవాడలో మండిపడ్డారు.రాష్ట్ర పునర్విజభన చట్టం చెల్లినప్పుడు... సెక్షన్-8 ఎందుకు చెల్లదని కేసీఆర్ను ఆయన ప్రశ్నించారు. విభజన నేపథ్యంలో గవర్నర్కు ప్రత్యేక బాధ్యతలు ఉంటాయని సెక్షన్ - 8లో పేర్కొన్నారని ఉమా ఈ సందర్భంగా గుర్తు చేశారు.

సెక్షన్ -8 చెల్లదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొనడం సరికాదని ఉమా అభిప్రాయపడ్డారు. సెక్షన్ 8 చెల్లకుంటే ఏపీ పునర్విభజన చెల్లుతుందా? అని కేసీఆర్ను దేవినేని ఉమా సూటిగా ప్రశ్నించారు. అంతర్గత భద్రత, శాంతి భద్రతలు గవర్నర్ చేతిలోనే ఉంటాయని విభజన చట్టంలో చెప్పారని దేవినేని ఉమా వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement