మల్కాజిగిరి ఎంపీ రేసులో దేవేందర్ గౌడ్ తనయుడు? | Sakshi
Sakshi News home page

మల్కాజిగిరి ఎంపీ రేసులో దేవేందర్ గౌడ్ తనయుడు?

Published Tue, Apr 8 2014 7:12 PM

మల్కాజిగిరి ఎంపీ రేసులో దేవేందర్ గౌడ్ తనయుడు? - Sakshi

హైదరాబాద్: దేశంలోన అతిపెద్ద నియోజకవర్గం మల్కాజ్‌గిరి టీడీపీ లోకసభ అభ్యర్థిగా కొత్త పేరు తెరపైకి వచ్చింది. ఉప్పల్ టికెట్ ఆశించి భంగపడిన దేవేందర్‌గౌడ్ కొడుకు వీరేంద్రగౌడ్‌కు ఎంపీ టికెట్ కేటాయించినట్లు సమాచారం. బీజేపీతో పొత్తులో భాగంగా  ఉప్పల్ టికెట్ను టీడీపీ వదులుకుంది. అయితే టికెట్ పై ఆశలు పెంచుకుని నిరాశపడిన వీరేంద్రగౌడ్ కు మల్కాజ్‌గిరి ఎంపీ సీటును ఇచ్చేందుకు పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. 
 
అయితే మల్కాజిగిరి టికెట్ ను ఆశిస్తున్న మల్లారెడ్డి, రేవంత్‌రెడ్డి లు టికెట్ ఆశిస్తున్నట్టు చంద్రబాబుకు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వీరేంద్రగౌడ్‌ కు టికెట్ దక్కుతుందా లేక రేవంత్ రెడ్డి, మల్లారెడ్డిలు తమ పంతం నెగ్గించకుంటారా అనే అంశం ఉత్కంఠగా మారింది. ఇప్పటికే మల్కాజిగిరి స్థానం నుంచి సిట్టింగ్ ఎంపీ సర్వే సత్యనారాయణ, వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి మాజీ డీజీపీ దినేష్ రెడ్డి, ఎమ్మెల్సీ నాగేశ్వర్, లోకసతా అధినేత జయప్రకాశ్ నారాయణ్ రంగంలో ఉన్నారు. టీఆర్ఎస్ నుంచి ఇటీవలే ఆపార్టీ లో చేరిన మైనంపల్లి హన్మంతరావుకు టికెట్ ఖరారు కావాల్సిఉంది. 
 

Advertisement
 
Advertisement
 
Advertisement