మానవత్వం చాటుకున్న డిప్యూటీ సీఎం | Deputy CM Narayana Swamy Help Blind Person | Sakshi
Sakshi News home page

మానవత్వం చాటుకున్న డిప్యూటీ సీఎం

Oct 8 2019 7:09 PM | Updated on Oct 8 2019 8:10 PM

Deputy CM Narayana Swamy Help Blind Person - Sakshi

సాక్షి, విజయవాడ: భవానీ దీక్షలో ఉన్న అంధ భక్తుడిని స్వయంగా దగ్గరుండి దర్శనం చేయించి డిప్యూటీ సీఎం నారాయణస్వామి మానవత్వాన్ని చాటుకున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన అంధ భక్తుడు భవానీ మాల ధరించి.. విరమించుకునేందుకు మంగళవారం దుర్గమ్మ సన్నిధికి చేరుకున్నారు. సుమారు ఐదు గంటల పాటు క్యూలైన్‌లో ఇరుక్కుపోయి ఇబ్బందిపడుతున్న అంధ భక్తుడిని గమనించిన నారాయణస్వామి తనతో పాటు దర్శనానికి తీసుకెళ్లారు. పోట్రోకాల్‌ను కూడా పక్కన పెట్టి మానవతా దృక్ఫథంతో తనతో పాటు తీసుకెళ్ళి అమ్మవారి దర్శనం చేయించిన డిప్యూటీ సీఎం నారాయణస్వామిని భక్తులు అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement