టీటీడీలో డిపాజిట్ల గోల్‌మాల్‌ | Deposits fraud in Tirumala Tirupati Devasthanam | Sakshi
Sakshi News home page

టీటీడీలో డిపాజిట్ల గోల్‌మాల్‌

Apr 2 2018 1:31 PM | Updated on Aug 28 2018 5:43 PM

Deposits fraud in Tirumala Tirupati Devasthanam - Sakshi

సాక్షి, తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానంలో డిపాజిట్ల గోల్మాల్ బయటపబడింది. నిబంధనలకు విరుద్ధంగా రూ. 4 వేల కోట్లను టీటీడీ ఆర్థికశాఖ అధికారులు బ్యాంకులో డిపాజిట్‌ చేశారు. సీల్డ్‌ కవర్‌ టెండర్లను ఆహ్వానించకుండా, అధికారులు ఫోన్‌తో సంప్రదింపులు జరిపారని సమాచారం. 7.66 శాతం వడ్డీ పేరుతో ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌లో వెయ్యి కోట్లు డిపాజిట్‌ చేశారు.

అంతే కాకుండా 7.33 శాతం వడ్డీ ఇస్తామన్న విజయాబ్యాంక్‌ని కాదని 7.32 శాతానికి ఆంధ్రా బ్యాంకును ఒప్పించిన టీటీడీ అధికారులు రూ. 3 వేల కోట్లను బ్యాంకులో డిపాజిట్ చేశారు. దీంతో టీటీడీలో జరిగిన ఈ గోల్‌మాల్‌పై ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫిర్యాదులు అందాయి. ఈ ఘటనపై ఇంటిలెన్స్‌ వర్గాలు విచారణ జరుపుతున్నాయి. 

Advertisement
 
Advertisement
Advertisement